హుజురాబాద్ బై పోల్: రంగంలోకి దిగిన ఈటల

by Sridhar Babu |   ( Updated:2021-06-30 23:07:26.0  )
Etela rajender focus on Huzurabad ByPoll
X

దిశ, హుజురాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికపై మంత్రి ఈటల రాజేందర్ దృష్టి పెట్టారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టి విజయం సాధించేందుకు ఇప్పటినుంచే వ్యూహలు రచిస్తున్నారు. మరో కొద్దినెలల్లో ఉపఎన్నిక జరగనున్న క్రమంలో ఇప్పటినుంచే ప్రజలతో టచ్‌లో ఉంటున్నారు. ఇవాళ ఉదయం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో వాకింగ్ చేస్తున్న వాకర్స్‌తో పాటు మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులతో ఈటల ముచ్చటించారు.

వాకర్స్, వ్యాపారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఈటలకు వివరించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఆరుసార్లు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చారని, త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో కూడా ఆదరించాలని ఈటల కోరారు. కాగా హుజురాబాద్‌లో గెలిచేందుకు పార్టీన్నీ ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నాయి.

Advertisement

Next Story