- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ నిజస్వరూపం ఇదంటున్న ఈటల..
దిశ, కమలాపూర్ : వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బుధవారం బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వరంగల్, సిద్దిపేటకు వచ్చిన కేసీఆర్ మాటలు వింటే ధర్మానికి నిలువెత్తు సాక్ష్యం అనుకునేలా ఉన్నాయని కానీ, ఆయన అసలు రంగు బయటకు తెలియదని అన్నారు. పరకాల ఎమ్మెల్యేతో నీచపు పనులు చేయిస్తున్న వ్యక్తి కేసీఆర్ అని, పదవుల కోసం ఎమ్మెల్యేలు బానిసలుగా మారారు కావచ్చు.. కానీ, ఐఏఎస్ అధికారులకు ఏమైందిని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందా అని అడిగారు. కేసీఆర్ నమ్ముకునేది డబ్బు, కుట్ర, మోసాలను తప్ప ధర్మాన్ని, ప్రజలను కాదన్నారు. హుజురాబాద్ గడ్డపై ఉద్యమకారుడిగా, ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయ్యాయని ఈటల వివరించారు.
తెలంగాణలోని పోలీసులు, టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులు, టీఎన్జీవో ఉద్యోగులు హుజరాబాద్‌లో ఉపఎన్నికల్లో రాజేంద్ర అన్న గెలవాలని కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నాయకులు సిద్దిపేటలో అడ్డా పెట్టి కుల సంఘాలను, నాయకులను తీసుకపోయి డబ్బులు ఇస్తున్నారని, ఆ డబ్బులు వారి అయ్య సొత్తు కాదని.. ఆ డబ్బులు తీసుకుని ఓటు మాత్రం ధర్మం వైపు నిలబడి బీజేపీకే ఓటు వేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో హుజురాబాద్ నియోజకవర్గానికి ఐదుగురు మంత్రులు పదిమందికి పైగా ఎమ్మెల్యేలు, కురుస నాయకులు వచ్చి ఎన్నికల హామీలు, వరాలు ఇస్తూ ఇక్కడే మకాం వేస్తారని ఈటల గుర్తుచేశారు.
రేషన్ కార్డు ,పెన్షన్లు ఇండ్లు ఇస్తామని అవి చేస్తాం, ఇవి చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేస్తారని ఆ తర్వాత ఇటు ముఖాన కూడా చూసేందుకు రారన్నారు. రాబోయే 2023 ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద గెలిచేది, ఎగిరేది కాషాయ జెండాయే అని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ధర్మారావు ఎంపీపీ తడక రాణి, శ్రీకాంత్ నాయకులు, దేశిని కోటి, తుమ్మ శోభన్ బాబు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.