నారాయణ కాలేజీలో ఐసోలేషన్ కేంద్రం

by Shyam |   ( Updated:2020-04-03 01:26:46.0  )

దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటి గ్రామంలోని నారాయణ జూనియర్ కళాశాలలో కొవిడ్-19 ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు కళాశాలను పరిశీలించి వైద్యాధికారులకు తగిన సూచనలు చేశారు. ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లిన వారి కుటుంబసభ్యులకు ఇక్కడ ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజేశ్వరరావు, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: Establishment, Isolation, Narayana College, MEDAK, SANGAREDDY

Advertisement

Next Story