మిలటరీ ఏరియాలో ఐసోలెటెడ్ కేంద్రాలు: ఈటల

by Shyam |   ( Updated:2020-02-10 11:14:02.0  )
మిలటరీ ఏరియాలో ఐసోలెటెడ్ కేంద్రాలు: ఈటల
X

హైదరాబాద్‌లోని మిలటరీ ఏరియాలో కరోనా ఐసోలెటెడ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వ్యాధి సోకిన వారికి ప్రత్యేకంగా వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‎లో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా ఎవరికీ సోకలేదని స్పష్టం చేశారు. ఒక వేళ సోకినట్టయితే కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలో కూడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గంభీరమైన అంశాన్ని కేంద్ర కానీ రాష్ట్రం కాని దాచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలను అప్రమత్తత చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఈటల వ్యాఖ్యనించారు. వ్యాధి సోకిన వారి నుంచి మరొకరికి సోకకుండా జనావాసాలు లేకుండా ఉండే మిలటరీ ఏరియాల్లో.. కేంద్రం ఐసోలెటెడ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇదే విధానాన్ని హైదరాబాద్‎లో కూడా అమలు చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

Advertisement

Next Story