ఓఆర్ఆర్ సమీపంలో నూతన రెడ్ క్రాస్ సెంటర్

by Shyam |
ఓఆర్ఆర్ సమీపంలో నూతన రెడ్ క్రాస్ సెంటర్
X

దిశ, మేడ్చల్: శామీర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నూతన రెడ్ క్రాస్ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించినట్టు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం కలెక్టర్ చాంబర్‌లో రెడ్ క్రాస్ సోసైటి కోర్ కమిటీతో ట్రామ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రామ సెంటర్, బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధులను దాతల నుంచి సేకరించాలన్నారు. భవన నిర్మాణం, చుట్టూ ప్రహారి గోడ చక్కగా నిర్మించాలన్నారు. మేడ్చల్ జిల్లా రెడ్ క్రాస్ సోసైటీ పేరుతో ఒక వెబ్‌సైట్ ప్రారంభించాలన్నారు. రెడ్‌క్రాస్ సోసైటీ సేవలు ప్రజలకు అందించేందుకు అంబులెన్స్, మార్చురి వ్యాన్, జనరిక్ మెడికల్ షాపు, బ్లడ్ డోనేషన్ క్యాంపుల ఏర్పాటు చేయాలని రెడ్ క్రాస్ సోసైటీ కోర్ కమిటీకి సూచించారు. మేడ్చల్ జిల్లా అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు రెడ్‌క్రాస్ సోసైటీ మెంబర్ షిప్ తీసుకోవాలని సూచించారు. ట్రామ సెంటర్‌కు కావాల్సిన మిషనరీని దాతలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని, భవన, నిర్మాణానికి నిధులు సమకూర్చుకొని ఆగస్టు 15 లోపు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో రెడ్‌క్రాస్ సోసైటీ ఆహారం, నిత్యావసర సరుకులు, బ్లడ్ తదితర సహాయక చర్యలు చేపట్టినందుకు వారిని అభినందించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, డీఆర్వో మధుకర్ రెడ్డి, కీసర ఆర్డీఓ రవి, రెడ్ క్రాస్ సోసైటీ చైర్మెన్ ఎస్ఎం. రాజేశ్వర్ రావు, వైస్ చైర్మెన్ శ్రీనివాస్ నాయుడు, కోశాధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed