ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది : మంత్రి ఎర్రబెల్లి

by Shyam |   ( Updated:2020-04-07 00:41:53.0  )
errabelli dayakar rao
X

దిశ, వరంగల్:
రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన సింగరాజుపల్లె, విస్నూరు, చెన్నూరు, కొడకండ్ల తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నీళ్ళు పుష్కలంగా అందడంతో పంటలు బాగా పండాయని, మంచి దిగుబడులు వచ్చాయన్నారు. దురదృష్టవశాత్తు కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని అయినా సరే, దేశంలో ఎక్కడా లేని విధంగా, రైతులు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ ప్రతి ధాన్యం, మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారన్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించే విధంగా రైతు సమన్వయకర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, అధికారులు కలిసి గ్రామ స్థాయిల్లో కమిటీలు వేయాలని సూచించారు. ఆ కమిటీల సాయంతో రైతులకు ఇబ్బందులు రాకుండా టోకెన్లు ఇవ్వాలన్నారు. టోకెన్ల ప్రకారం రైతుల ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలన్నారు.

Tags: minister Errabelli Dayakar Rao, opened, grain buying centers, warangal

Advertisement

Next Story