- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త ఉద్యోగస్తులు 28 శాతం పెరిగారు..!
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది జనరిలో కొత్తగా 13.36 లక్షల మంది చందాదారులు ఈపీఎఫ్ఓ పేరోల్‌లో చేరారని, దీంతో గతేడాది జనవరితో పోలిస్తే ఇది 27.79 శాతం వృద్ధి అని ఈపీఎఫ్ఓ తెలిపింది. 2020 డిసెంబర్‌తో పోలిస్తే 24 శాతం అధికంగా చందాదారులు నమోదయ్యారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి 10 నెలల కాలంలో కొత్తగా 62.49 లక్షల మంది ఈపీఎఫ్ఓలో చేరారు. పేరోల్ డేటా ప్రకారం.. 2019-20లో కొత్త చందాదారుల సంఖ్య 78.58 లక్షలుగా ఉండేది.
గతేడాది కరోనా కారణంగా జూన్ నెలలో ఈపీఎఫ్ఓ నుంచి ఎక్కువ సంఖ్యలో నిష్క్రమించారు. మళ్లీ ఇటీవల వీరి సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది జనవరిలో చేరిన మొత్తం 13.36 లక్షల మందిలో 8.20 లక్షల మంది కొత్తవారు ఉండగా, మిగిలిన వారు ఉద్యోగాల్లోకి తిరిగి చేరిన వారు లేదంటే, వేరే ఉద్యోగాలకు మారిన వారని కార్మిక శాఖ తెలిపింది. వయస్సుల వారీగా పరిశీలిస్తే..ఈ జనవరిలో 22-25 మధ్య వయసు ఉన్నవారు 3.48 లక్షలు ఉండగా, 29-35 ఏళ్ల మధ్య ఉన్న వారు 2.69 లక్షల మంది ఉన్నారు.