ఈపీఎఫ్‌ల నుంచి రూ. 280 కోట్లు తీసేశారు!

by Harish |
ఈపీఎఫ్‌ల నుంచి రూ. 280 కోట్లు తీసేశారు!
X

దిశ, వెబ్‌డెస్క్: మనిషి భయస్థుడు. ప్రమాదం ముంచుకొస్తోంది అనగానే తనకు అవసరమైన దాన్ని, తనకు సౌకర్యంగా ఉన్నదాన్ని అంటిపెట్టుకుని కూర్చుంటాడు. ఇటీవల ప్రపంచ మానవాళిని ప్రాణ భయంతో వణికిస్తున్న కొవిడ్-19 మహమ్మరి కారణంగా దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెన్షన్ ఫండ్‌ల నుంచి సుమారు 75 శాతం వరకూ ఉపసంహరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఇదే అదనుగా కేవలం పదిరోజుల్లో చందాదారులు ఏకంగా రూ. 280 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారని ఎంప్లాయి ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా ప్రధానమంత్రి ఆదేశాల మేరకు 1.37 లక్షల మంది చందాదారులు రూ. 279.65 కొట్లను చెల్లించినట్టు ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది.

గత నెల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈపీఎఫ్‌వోలో ఉన్న 4 కోట్ల మంది ఉద్యోగులు మూడు నెలల వరకూ ఇబ్బందులు లేకుండా అవసరమైన వారు ఈపీఎఫ్ నుంచి 75 శాతం తీసుకోవచ్చని ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున ఈపీఎఫ్ ఉపసంహరణకు డిమాండ్ పెరిగింది. వాటన్నిటినీ పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో కొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా 1.37 లక్షల క్లెయిమ్స్‌ను పరిష్కరించి, ఈ ప్రక్రియ మొత్తం మూడు రోజుల్లోగా పూర్తీ చేస్తామని వివరించింది.

Tags: EPFO, PF withdrawal, provident fund withdrawal, pf subscribers

Advertisement

Next Story

Most Viewed