రెండో వన్డేకు ముందు ఇంగ్లండ్‌కి ఎదురుదెబ్బ

by Shiva |
రెండో వన్డేకు ముందు ఇంగ్లండ్‌కి ఎదురుదెబ్బ
X

దిశ, స్పోర్ట్స్ : వరుస ఓటములతో నిరాశలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తలిగింది. మొదటి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ రెండో వన్డేకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మోర్గాన్ చేతికి గాయంకావడంతో మూడు కుట్లు కూడా వేశారు. దెబ్బ తగిలిన వెంటనే మోర్గాన్ గాయపడటంతో జాస్ బట్లర్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత గాయంతోనే బ్యాటింగ్ చేసిన మోర్గాన్ 22 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఇక సామ్ బిల్లింగ్స్‌ కూడా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చూస్తూ గాయపడ్డాడు. ఫోర్‌ను ఆపే క్రమంలో భుజం బెనకడంతో మైదానాన్ని వీడారు. వీరిద్దరినీ పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరం అని పేర్కొన్నారు. దీంతో శుక్రవారం జరగాల్సిన వన్డే మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story