‘జీతాలు సమయానికి ఇవ్వండి’

by Shamantha N |
‘జీతాలు సమయానికి ఇవ్వండి’
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని కేంద్రం స్పందించింది. వైద్య సిబ్బందికి సమయానికి వేతనాలివ్వాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశామని కేంద్రం తెలిపింది.

కాగా, కేంద్ర వైఖరిపై జస్టిస్ ఎంఆర్ షా అసంతృప్తి వ్యక్తంచేస్తూ, ‘మీరు నిస్సహాయులేమీ కాదు. మీ ఆదేశాలు సరిగ్గా అమలవుతున్నాయా? లేదా? అని చూసే బాధ్యత మీపై ఉంటుంది. మీకు విపత్తు నిర్వహణ చట్టం కింద అధికారాలు గలవు. కావాలనుకుంటే మీరు చర్యలూ తీసుకోవచ్చు’ అని అన్నారు.

పంజాబ్, మహారాష్ట్ర, త్రిపుర, కర్ణాటకలు ఈ ఆదేశాలను పాటించలేదని తెలుస్తోంది. అంతేకాదు, హెల్త్ వర్కర్లు క్వారంటైన్‌లో ఉన్న కాలాన్ని సెలవులుగా పరిగణిస్తున్నారన్న పిటిషన్‌పైనా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని న్యాయస్థానం ఆదేశించింది. వైద్య సిబ్బంది క్వారంటైన్‌లో ఉంటే వాటిని సెలవులుగా పరిగణించడం సరికాదని, ఈ విషయాన్ని పరిశీలిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed