‘సై’ మూవీని తలపించేల మంకీల రివెంజ్.. ఆందోళనలో స్థానికులు 

by Shamantha N |
monkeys and dogs
X

ముంబై: సినిమాల్లో ఓ వర్గం మరో వర్గంపై ప్రతీకార డ్రామాను చూస్తాం. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ మహారాష్ట్రలో విచిత్రం జరిగింది. ఓ ప్రాంతంలో శునకాలు, వానరాలకు భీకర పోరు జరుగుతుంది. ఈ పోరులో ఇప్పటివరకు 200కు పైగా శునకాలు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. అదేంటి వానరాలు శునకాలను చంపడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే మజల్గావ్ ప్రాంతంలో ఇదే జరిగింది. గత నెల రోజులుగా వానరాలకు, శునకాలకు పోరు నడుస్తూనే ఉంది. వీటి పోరుకు భయపడి జనాలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారంటే, పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కుక్కపిల్ల కనిపిస్తే ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్లి కిందికి విసరేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కోతులను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు వస్తున్నప్పటికీ అవి చిక్కట్లేదని తెలిపారు. వానరాల గుంపు శునకాల పిల్లలే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు వానరాల దెబ్బకు ఆ ప్రాంతంలో కుక్కపిల్లలు కనిపించకుండా అయ్యాయని తెలిపారు. గ్రామస్థులు కుక్కపిల్లలను రక్షించాలని ప్రయత్నిస్తే, వారిపై దాడి చేస్తున్నట్లు వెల్లడించారు. వీటి భయానికి పిల్లలను పాఠశాలలకు పంపడానికి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే అంతకుముందు కొన్ని కుక్కపిల్లలు, పిల్ల వానరాన్ని చంపడంతోనే ఇలా చేస్తున్నాయని కొందరు చెబుతున్నారు.

monkeys and dogs

Advertisement

Next Story

Most Viewed