- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైజ ద బ్యాట్ సిరీస్ ఇంగ్లాండ్ వశం
దిశ, స్పోర్ట్స్: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ 500 వికెట్ల మైలురాయిని దాటాడు. ఇక పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులో జేమ్స్ అండర్సన్ 600 వికెట్ల మైలు రాయి చేరుకోవడం, జాక్ క్రాలీ అద్భుత డబుల్ సెంచరీ చేయడం మినహా ఈ టెస్టు గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బయో సెక్యూర్ మైదానంలో రోజెస్ బౌల్‌లో జరిగిన మ్యాచ్ టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. జాక్ క్రాలీ చేసిన 267, జాస్ బట్లర్ 152 పరుగుల సహాయంతో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 583/8 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత పలుమార్లు వర్షం, వెలుతురు లేమి వంటి అంతరాయాల కారణంగా పాకిస్తాన్ జట్టు రెండు ఇన్నింగ్స్‌లు నెమ్మదిగా సాగాయి. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్ (5/56) ధాటికి పాక్ జట్టు 273కే ఆలౌట్ అయ్యి 310 పరుగులు వెనుకబడింది. దీంతో ఫాలో ఆన్ మొదలు పెట్టిన పాకిస్తాన్ జట్టు నాలుగో రోజు సరైన వెలుతురు లేని కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 100/2 పరుగులు చేసింది.
ఇక చివరి రోజు కూడా ఆట వర్షం, చిత్తడిగా మారిన గ్రౌండ్ కారణంగా చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్ ఎలాగో డ్రా అవుతుందని అందరికీ తెలిసినా జేమ్స్ అండర్సన్ 600 వికెట్లు చేరాలనే తపనే ఇంగ్లాండ్ ఆటగాళ్లతో ఉంది. చివరకు మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే అజర్ అలి.. జోరూట్‌కు క్యాచ్ ఇవ్వడంతో అండర్సన్ ఆ అరుదైన ఘనత అందుకున్నాడు. 83.1 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి పాక్ జట్టు 187 పరుగులు చేశాక ఇరు కెప్టెన్ల అంగీకారంతో అంపైర్లు మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ జట్టు 1-0తో గెలుపొందింది.
అండర్సన్ రికార్డు..
ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ టెస్టు క్రికెట్‌లో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 593 వికెట్ల వద్ద ఉన్న అండర్సన్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాట్స్‌మాన్ అజర్ అలీని అవుట్ చేయడం ద్వారా 600 వికెట్ల మైలు రాయి చేరుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రంలో 600 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్ అండర్సనే కావడం విశేషం. అంతకు ముందు 600 వికెట్ల మైలు రాయి చేరుకున్న ముగ్గురూ స్పిన్నర్లే కావడం గమనార్హం. ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అనిల్ కుంబ్లే (619) మాత్రమే అండర్సన్ కంటే ముందున్నారు. 2003లో టెస్టు క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన అండర్సన్‌కు ఇది 156వ టెస్టు.
స్కోర్ బోర్డు సంక్షిప్తంగా..
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్ : 583/8 డిక్లేర్డ్
జాక్ క్రాలీ 267, జాస్ బట్లర్ 152
పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ : 273 ఆలౌట్
అండర్సన్ 5 వికెట్లు
పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ : 187/4
అండర్సన్ 2 వికెట్లు