ఇంటికి చేరుకున్న ఇంగ్లాండ్ ప్లేయర్స్

by Shyam |
ఇంటికి చేరుకున్న ఇంగ్లాండ్ ప్లేయర్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ బయోబబుల్ వదిలి ఇంగ్లాండ్ క్రికెటర్లు ఇంటికి చేరుకున్నారు. లీగ్ అర్దాంతరంగా వాయిదా పడటంతో క్రికెటర్లు అందరూ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన జానీ బెయిర్‌స్టో, జాస్ బట్లర్, సామ్ బిల్లింగ్స్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, జేసన్ రాయ్, సామ్ కర్రన్, టామ్ కర్రన్ బుధవారం ఉదయం లండన్ చేరుకున్నారు. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్న కొంత మంది క్రికెటర్లు, ఢిల్లీలోనే ఉన్న మరికొంత మంది కలసి నేరుగా లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

అక్కడ వారు ప్రభుత్వం నిర్దేశించిన హోటల్స్‌లో క్వారంటైన్‌కు వెళ్లారు. ఇక ఇయాన్ మోర్గాన్, దావీద్ మలన్, క్రిస్ జోర్డాన్ గురువారం ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లనున్నారు. వాళ్లు కూడా అక్కడికి చేరుకున్న వెంటనే క్వారంటైన్‌కు వెళ్తారు. ఇండియా నుంచి వస్తున్న ప్రయాణికులు రెడ్ లిస్టులో ఉండటంతో వారు కచ్చితంగా క్వారంటైన్ పాటించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story