- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాంటి ఫ్యాన్స్ మాకెందుకు : హ్యారి కేన్
దిశ, స్పోర్ట్స్: యూరో కప్ 2020 ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీపై పెనాల్టీ షూటవుట్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. పెనాల్టీ కిక్ తీసుకున్న ఇంగ్లాండ్ ప్లేయర్లలో మిస్ అయ్యింది ముగ్గురు నల్లజాతీయులు కావడంతో సోషల్ మీడియాలో జాత్యహంకార వ్యాఖ్యలు మిన్నంటాయి. స్వయంగా ఇంగ్లాండ్ జట్టు అభిమానులే ఈ వ్యాఖ్యలను వైరల్ చేయడమే కాకుండా విధ్వంసానికి కూడా దిగారు. దీనిపై ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఫైనల్లో మేం ఓడిపోయినందుకు మాకు బాధగానే ఉంది. కానీ దురదృష్టవశాత్తూ మేము ఫలితాన్ని అందుకోలేకపోయాం. అంత మాత్రానికే ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలకు దిగుతారా?.. జట్టుకు అవసరం లేదని వారిపై కామెంట్లు చేశారు. ఇప్పుడు నేను చెబుతున్నా.. వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన మీలాంటి అభిమానులు మాకొద్దు. ఎంతో ప్రతిభ కలిగిన వాళ్లు కాబట్టే వారు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతే కాని ఆషామాషీగా వారిని తీసుకోలేదు’ అని కెప్టెన్ హ్యారీ కేన్ అన్నాడు.