యూరో కప్‌లో ఇంగ్లాండ్ తొండాట

by Shyam |
Denmark
X

దిశ, స్పోర్ట్స్: డెన్మార్క్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు తీరుపై యూఈఎఫ్ఏ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి సమాయాత్తం అయ్యింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు హారీ కేన్ పెనాల్టీ గోల్ కొడుతున్న సమయంలో డెన్మార్క్ గోల్‌కీపర్ కాస్పర్ కెమిచెల్‌పై లేజర్ పెన్‌తో వెలుగు పడేటట్లు చేశారు. సరిగ్గా గోల్ చేసేసమయంలో అతడి దృష్టిని మరల్చేలా చేయడానికి గ్రీన్ కలర్ లేజర్‌ను పదే పదే మైదానం వెలుపల నుంచి వేశారు. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియో ఫుటేజీని యూఈఎఫ్ఏ సేకరించింది. ఆ గోల్ కాస్పర్ అడ్డుకున్నాడు.

కానీ ఎక్స్‌ట్రా సమయంలో హారికేన్ మరో గోల్ చేసి ఇంగ్లాండ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఈ విజయంతో 55 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ తొలిసారి యూరోకప్ ఫైనల్ చేరింది. కానీ, అదే సమయంలో తొండాటతో అందరి ఆగ్రహానికి గురయ్యింది. ఇంగ్లాండ్ జట్టు యాజమాన్యంపై దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు డానిష్ జాతీయ గీతం ఆలపించే సమయంలోనే వింబ్లే స్టేడియంలో బాణసంచా కాల్చడంపై కూడా యూఈఎఫ్ఏ ఎథ్నిక్ కమిటీ దర్యాప్తు ప్రారంభించింది.

Advertisement

Next Story