- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఇంగ్లాండ్ జట్టుకు భారీ జరిమానా.. పాయింట్లలో కోత
దిశ, స్పోర్ట్స్: యాషెస్ సిరీస్‌లోని తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. బ్రిస్బేన్ టెస్టులో స్లో వోవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్నది. గబ్బా టెస్టులో నిర్ణయించిన సమయంలో 5 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేయడంతో ఐసీసీ ఎలైట్ ప్యానల్ రిఫరీ డేవిడ్ బూన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలోపు తక్కువ వేసిన ప్రతీ ఓవర్‌కు 20 శాతం మ్యాచ్ ఫీజులో కోత పడుతుంది. దీంతో ఐదు వోవర్లకు గాను 100 శాతం జరిమానా విధించారు.
అలాగే ఆర్టికట్ 16.11.2 ప్రకారం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్లలో ప్రతి ఓవర్‌కు ఒక పాయింట్ చొప్పున 5 పాయింట్ల కోత విధించారు. ఇంగ్లాండ్ జట్టు గతంలో కూడా స్లో వోవర్ రేట్ కారణంగా రెండు పాయింట్లను కోల్పోయింది. ఇక ప్రస్తుతం శ్రీలంక జట్టు 100 శాతం విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా రెండో స్థానానికి చేరుకున్నది. టీమ్ ఇండియా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. పాయింట్ల పరంగా టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉన్నా.. విజయాల శాతం పరంగా నాలుగో స్థానంలో ఉన్నది.