మైనర్ బాలికపై ఇంజినీరింగ్ విద్యార్థి లైంగికదాడి

by srinivas |
rape
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఇంజినీరింగ్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాళ్లోకి వెళితే.. జిల్లాకు చెందిన నిందితుడు మణి సోషల్ మీడియా ద్వారా ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఆమెతో చనువుగా ఉండటం ప్రారంభించారు. ఈ క్రమంలో అతని వద్ద డమ్మీ గన్ చూపించి, బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు మణిపై దిశ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story