కిరాతకం : ఇంజినీరింగ్ విద్యార్థి దారుణ హత్య

by srinivas |   ( Updated:2021-07-28 02:52:58.0  )
kidnap-and-murder
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. డబ్బుల కోసం ఇంజినీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేయడమే కాకుండా దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని నల్లజర్ల మండలం పోతవరంలో బుధవారం ఉదయం వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. నిన్న రాత్రి వంశీ అనే ఇంజినీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు దుండగులు రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో వంశీని దారుణంగా హత్య చేసి గ్రామశివారులో పడేసారు కిడ్నాపర్లు. ఈ విషయం తెలియడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే, మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ కోసం వెతుకుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story