- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఎఫెక్ట్.. వన్డే మ్యాచ్ వాయిదా
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య కేప్‌టౌన్‌లో జరగాల్సిన తొలి వన్డేను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఇరు జట్లు మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కావల్సి ఉన్నది. కాగా, మ్యాచ్‌కు ముందు రోజు జరిపిన కరోనా పరీక్షల్లో ఓ దక్షిణాఫ్రికా ఆటగాడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మ్యాచ్ వాయిదా వేసింది. ఇతర ఆటగాళ్ల ఆరోగ్యాలపై ప్రభావం చూపకూడదనే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణాఫ్రికా తాత్కాలిక సీఈవో కుగాండ్రి గోవెందర్, ఈసీబీ సీఈవో టామ్ హారిసన్ ప్రకటించారు. ప్రస్తుతం కరోనా సోకిన ఆటగాడిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు వారు వెల్లడించారు. శుక్రవారం వాయిదా వేసిన మ్యాచ్‌ను ఆదివారం నిర్వహిస్తామని, రెండో వన్డే సోమవారం ఉంటుదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది.
Advertisement
Next Story