పీఎఫ్ఐ‌పై ఈడీ దాడులు..కీలక ఆధారాలు లభ్యం!

by Shamantha N |   ( Updated:2020-12-03 06:45:05.0  )
పీఎఫ్ఐ‌పై ఈడీ దాడులు..కీలక ఆధారాలు లభ్యం!
X

దిశ, వెబ్ డెస్క్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సంస్థపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా 26 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పీఎఫ్ఐ చైర్మెన్ ఓఎం అబ్దుల్లా సలాం, కేరళ అధ్యక్షుని ఇంట్లో ఈడీ సోదాలను నిర్వహించింది. ఫిబ్రవరిలో ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు ఆర్థికంగా పీఎఫ్ఐ సహకరించిందన్న ఆరోపణలపై ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ఈడీ సేకరించినట్టు సమాచారం. కాగా రైతుల ఆందోళనల నుంచి దృష్టిని మరల్చేందుకే ఈడీ దాడులు చేస్తోందని పీఎఫ్ఐ చైర్మెన్ ఓఎం అబ్దుల్లా అన్నారు.

Advertisement

Next Story