నిర్మానుష్యంగా మహింద్రా హిల్స్ ..!

by Shyam |
నిర్మానుష్యంగా మహింద్రా హిల్స్ ..!
X

దిశ, హైదరాబాద్: పట్టణంలోకి కరోనా వైరస్(కోవిడ్-19) ఎంటరవ్వడంతో.. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ సోకిన వ్యక్తి కుటుంబం సికింద్రాబాద్‌లోని మహింద్రాహిల్స్ కావడంతో.. ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో నివసించే వారంతా ఇంట్లో నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. ఇక్కడి రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ క్రమేపీ నగరంలోని మహింద్రాహిల్స్‌కు చేరుకోవడంతో స్థానికులంతా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story