- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యోగులకు ఇదే చెప్పా: కేసీఆర్
X
దిశ, వెబ్ డెస్క్: ‘తెలంగాణలో రైతుల అకౌంట్లలో రైతుబంధు నగదు జమ చేశాం. ఈ సందర్భంలో మాకు సగం జీతాలే ఇస్తూ రైతులకు మాత్రం డబ్బులిస్తున్నారని ఉద్యోగులు నన్ను ప్రశ్నించారు. దీంతో రైతులకు డబ్బులు ఇచ్చేందుకే మీకు ఆపానని వాళ్లకు బదులిచ్చాను’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్కులో ఆయన 6వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు జీతాలు ఆపినా రైతులకు, గ్రామపంచాయతీలకు నిధుల పంపిణీ మాత్రం ఆపడంలేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కష్ట కాలంలో ఎవరి వద్ద డబ్బులు ఉన్నా లేకున్నా రైతుల వద్ద ఉన్నాయన్నారు. భారతదేశంలో ప్రతిగ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
Advertisement
Next Story