ఎన్నికలు ఎలా జరుగుతాయో చూస్తాం: ఉద్యోగ సంఘాలు

by srinivas |
ఎన్నికలు ఎలా జరుగుతాయో చూస్తాం: ఉద్యోగ సంఘాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. కరోనా టీకాలు ఇచ్చేవరకు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని, మేం లేకుండా అసలు ఎన్నికలు జరుగుతాయో చూస్తామని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. మా ప్రాణాలు రక్షించుకునే హక్కు మాకు ఉందని, దాన్ని రాజ్యాంగం కల్పించిదని నేతలు శనివారం మీడియాకు వెల్లడించారు. ప్రాణపాయం వస్తే ఎదుటివాణ్ని చంపే హక్కును రాజ్యాంగం ఇచ్చిందని, మా హక్కును అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కాదనదని భావిస్తున్నామన్నారు. విధుల్లో పాల్గొనేవారితో ఎన్నికలు జరుపుకోవచ్చని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.

మరోవైపు మధ్యాహ్నం 3గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌పై ఉత్కంఠ నెలకొంది. సీఎస్, కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. అయితే సహకరించని అధికారులపై చర్యలు ఉంటాయని ఎస్ఈసీ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నఎస్ఈసీ.. ఎన్నికల కోడ్ అమలు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లు, ఎస్పీలదేనని స్పష్టం చేసింది.

Advertisement

Next Story