- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆయన’అండతో.. ఎమ్మెల్సీ స్థానంపై ‘ఆమె’గురి
దిశ, వెబ్డెస్క్: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని ఆమె తూచ తప్పకుండా పాటిస్తోంది. ఇప్పటికే ఉద్యోగ సంఘంలో కీలక నాయకురాలిగా ఉన్న ఆమె.. కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇదే మంచి అదునుగా భావిస్తున్న ఆమె.. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రీయాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోన్నట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఫిబ్రవరిలో జరిగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆమె ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆయన అండతో..
గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి అధికార పార్టీ తరఫున పోటీ చేసి ఉద్యోగ సంఘాల నాయకులు దేవిప్రసాద్ ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా ఈ స్థానాన్ని ఉద్యోగ సంఘాల నాయకులకు కేటాయించేలా అధికార పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి టీఆర్ఎస్లో కీలక పదవిలో ఉన్న మరో ఉద్యోగ సంఘం నాయకుడి అండతో పావులు కదుపుతున్నారని బోగట. ఆయన అండతో ఉద్యోగ సంఘంలో కీలక నేతగా ఎదిగిన ఆమె.. కొత్తగా రాజకీయాల్లో కూడా ఆయన అండతో ఎదగాలనే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే ఆయనకు మంచి పట్టున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఎమ్మెల్సీగా పోటి చేసి నెట్టుకురావచ్చని ఆశపడుతోంది.
అందరి నోటా ఇదే చర్చ..
హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఆమె చాలా కాలంగా విధులు నిర్వహిస్తుండడంతో పలు ఉద్యోగ సంఘాల నాయకులతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేయడంతో ఉద్యోగుల అండతో పాటు అధికార పార్టీని కూడా తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు ఉంటాయని అమె ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్న అధికార పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉద్యోగ సంఘాల నాయకుల్లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కీలక నేత అధిష్టానాన్ని ఒప్పించి ఉద్యోగ సంఘానికి చెందిన నాయకురాలికి చట్టసభల్లో అవకాశం ఇప్పించగలుగుతారా అనేది వేచి చూడాలి.