రూ.1.6 లక్షల కోట్లకు ఆభరణాల మార్కెట్!

by Shamantha N |
రూ.1.6 లక్షల కోట్లకు ఆభరణాల మార్కెట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయంగా ఎగుమతుల మార్కెట్ మెరుగవడంతో రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రమోషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(జీజేఈపీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు సుమారు రూ. 1.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఎగుమతుల వేగం ప్రతి నెలా రూ. 14.8 వేల కోట్ల నుంచి రూ. 18.5 వేల కోట్లతో కొనసాగితే రూ. 1.4 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్ల మార్కెట్‌తో ఈ ఏడాదిని ముగించగలమని జీజేఈపీసీ ఛైర్మన్ కొలిన్ షా చెప్పారు.

సోమవారం వర్చువల్‌గా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సెప్టెంబర్ తర్వాత నుంచి ఎగుమతులు నెమ్మదిగా మెరుగుపడుతున్నాయని, గతేడాది ఇదే నెలతో పోలిస్తే మొత్తం రవాణా 26.45 శాతం తగ్గిందని, అక్టోబర్‌లో ఇది 19 శాతానికి తగ్గిందని, నవంబర్‌లో 3.88 శాతం క్షీణించినట్టు ఆయన తెలిపారు. ‘కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల 3-4 నెలల్లో పలు కార్యక్రమాలను డిజిటల్ వేదిక ద్వారానే కొనసాగిస్తున్నాం. ఈ విధానం వల్ల దేశీయంగా కొనుగోలుదారులు, విక్రేతలకు మధ్య లావాదేవీలు సులువుగా జరుగుతున్నాయి. మొత్తం వాణిజ్యం ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడంలో మాత్రమే కాకుండా, వ్యాపారాభివృద్ధికి ఈ డిజిటల్ విధానం ఎంతో సహాయపడుతోందని’ అని తెలిపారు. తయారీ కూడా సాధారణ స్థితికి చేరుకుందని, కరోనాకు ముందు దాంట్లో 85-90 శాతానికి తిరిగి వచ్చేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed