- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్వేచ్ఛా జీవనం కోసం ఆరాటపడుతున్నా…
దిశ, సినిమా : స్వీడిష్ ఫిల్మ్ యాక్ట్రెస్ ఎల్లీ అవ్‌రమ్ బాలీవుడ్‌లో పనిచేయడాన్ని అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. ‘కిస్ కిస్‌కో ప్యార్ కరూన్’, ‘మిక్కీ వైరస్’, ‘మలాంగ్’ లాంటి హిందీ చిత్రాల్లో నటించిన బ్యూటీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటులు బీటౌన్‌లో పనిచేసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారని వివరించింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విదేశీయులకు ఇంతప్రేమ లభిస్తుండటం చూస్తే ఆనందంగా ఉందని తెలిపింది.
బాలీవుడ్ అంటే పడిచచ్చిపోయే విదేశీ నటుల్లో తాను ఒకరని, చిన్నప్పటి నుంచే బాలీవుడ్‌ను ప్రేమించడం మొదలుపెట్టానని తెలిపింది. హిందీలో పనిచేయాలని కలలు కంటున్న తాను తనలో స్ఫూర్తి నింపే ఒక యాక్టర్ కోసం ఎదురుచూసే క్రమంలో ‘లవ్ ఆజ్ కల్’ సినిమాలో ఇండియన్ క్యారెక్టర్ ప్లే చేసిన బ్రెజిల్ యాక్టర్‌ను చూసి ఇన్‌స్పైర్ అయ్యానని తెలిపింది. తాను చేసినప్పుడు నేనెందుకు చేయలేననే ప్రశ్నతో ముందుకు సాగానని, ఫైనల్‌గా బాలీవుడ్‌లో లాంచ్ అయ్యానని తెలిపింది. ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని, చాన్స్‌లు క్యూ కడుతుండటంతో డేట్స్ సర్దుబాటు కాక ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదని చెప్పింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా రాణించాలనే దాని గురించి భయం లేదు కానీ సమాజంలో సెలబ్రిటీగా కాకుండా స్వేచ్ఛకలిగిన వ్యక్తిగా ఎలా జీవించాలో తెలియడం లేదని చెప్పింది.