దసరా, బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం : బానోతు హరిప్రియ

by Sridhar Babu |   ( Updated:2021-10-14 06:30:20.0  )
దసరా, బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం : బానోతు హరిప్రియ
X

దిశ, ఇల్లందు : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిపే ప్రాంతం, పెద్దమ్మ తల్లి గుడిచెరువు కట్ట ప్రాంతంలో గల బతుకమ్మ ఘాట్ జమ్మి, దసరా ఉత్సవాలు జరుగు ప్రదేశాలను ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగకు ఇల్లందు పెట్టింది పేరని, అటువంటి పండుగను ఇల్లందులో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

కార్యక్రమంలో ఇల్లందు పురపాలక సంఘం చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావు, ఇల్లందు పురపాలక సంఘం వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, ఇల్లందు తహశీల్దారు కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్, మున్సిపాలిటీ డీఈ రామకృష్ణ, ఏఈ శంకర్, టీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ కమిటీ అధ్యక్షులు కొక్కు నాగేశ్వరావు, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండా శ్రీకాంత్, మేకల శ్యామ్, గిన్నారపు రాజేష్, ఎంటెక్ మహేందర్, రాచపల్లి శ్రీనివాస్, మణికిరణ్, బానోతు రవి నాయక్, వార్డు కౌన్సిలర్ ఆజాం, అంకెపాక నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story