- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించండి’
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ నేపథ్యంలో తమకు రూ. 50 లక్షల ఇన్సూరెన్స్‌ను కల్పించాలని రాష్ట్ర మీటర్ రీడర్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ట్రాన్స్‌కో ఆండ్ జెన్‌కో సీఎమ్‌డీలకు లేఖ రాశారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ శాఖలో 1800 మంది మీటర్ రీడింగ్ కార్మికులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. కారోనా వైరస్ విజృంభిస్తున్న సందర్భంలో జూన్ నెలలో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకోని రీడింగులు తీయవలసి వచ్చింది చెప్పారు. ఈ నెలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేక కార్మికులు భయాందోళనకు గురవుతున్నారన్నారు. టీఎస్ఎన్పీడీఎస్‌ఎల్, ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీలు నెలకు రూ.3 వేలు ఎప్రిల్, మే రెండు నెలలకు రూ.6 వేలు చొప్పున జీతాలు ఇవ్వాలని ఆర్డర్ పాస్ చేశారని గుర్తుచేశారు. కాంట్రాక్టర్లు మాత్రం ఇప్పటి వరకు ఒక రూపాయ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాణాలను, మా కుటుంబ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నామని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకొని మాస్కులు, శానిటైజర్లు, క్లౌజులు, పీ.పీ.ఈ కిట్లు ఇప్పించాలని కోరారు.