పెళ్లిలో విద్యుత్ షాక్.. నలుగురు అక్కడికక్కడే మృతి

by Sumithra |
Electric shock
X

దిశ, వెబ్‌డెస్క్ : బంధు,మిత్రులతో సంతోషంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. అప్పటి వరకు నవ్వులు విరిసిన ఆ ఇల్లు ఏడ్పులతో మార్మోగింది. గాలి మాటున వచ్చిన మృత్యువు నలుగురిని ఎత్తుకెళ్లింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌ సీతాపూర్‌ జిల్లా కమలాపూర్‌ సమీపంలోని ఓ గ్రామంలో శుక్రవారం రాత్రి పెళ్లితంతు జరుగుతుంది. ఆ సమయంలో బలంగా గాలి వీచి ఇంటి పక్కన ఉన్న విద్యుత్ స్తంభం వైర్లు తెగి పెళ్లి మండపంపై పడింది. దీంతో మండపంలో ఉన్న ఏడుగురికి కరెంట్ షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పెళ్లి కుమారుడు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, అప్పటి వరకు సందడి చేసిన వారు మృతి చెందడంతో పెళ్లింటా విషాదం అములుకుంది.

Advertisement

Next Story