విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షునిపై SPDCL వేటు..

by Shyam |   ( Updated:2021-03-06 20:35:19.0  )
విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షునిపై SPDCL వేటు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం అధ్యక్షుడు గంబో నాగరాజును ఎస్పీడీసీఎల్ యాజమాన్యం శనివారం సస్పెండ్ చేసింది. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, కార్మికులను సమ్మె దిశగా ప్రేరేపిస్తున్నారని, సంస్థ స్టాండింగ్ ఆర్డర్ల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ నర్సింహ స్వామి పేర్కొన్నారు. ఆరోపణలపై ప్రాథమికంగా విచారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఆర్టిజన్లకు విద్యుత్ బోర్డు సర్వీసు నిబంధనలు అమలు చేయాలని, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సంస్థ యాజమాన్యానికి ఇటీవల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సస్పెన్షన్ ఆర్డర్‌ను జారీ చేయడం గమనార్హం. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ కార్మికులను ఒక్కతాటిపై నడిపించి నాగరాజు గుర్తింపు పొందారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, హరీశ్‌రావులతో కలిసి అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం సెంట్రల్ సర్కిల్‌లోని సైఫాబాద్ సెక్షన్‌లో గ్రేడ్-3 ఆర్టిజన్‌ కార్మికుడిగా పనిచేస్తున్నారు. విచారణ పూర్తయ్యే వరకు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed