గ్రేటర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

by Anukaran |   ( Updated:2020-11-05 11:12:38.0  )
గ్రేటర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికలకు సిద్ధంగా ఉండి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి అధికారులకు సూచించారు. జోనల్ అధికారులు, శివారు జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణ౦లో జరిగే విధంగా పూర్తి చేయాలని సూచించారు. గురువారం ఎన్నికల సంఘం కార్యాలయంలో జీహెచ్ఎంసీ కమిషనర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు)తో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్థసారధి మాట్లాడారు.

ప్రస్తుత పాలకవర్గం కాల పరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనుందని, ఈలోగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అక్టోబర్ 31న ఓటరు జాబితా తయారీకి నోటిఫికేషన్ జారీ చేశామని, ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 7న ప్రచురించాలని, తుది జాబితా ఈ నెల 13న ప్రచురించాల్సి ఉందన్నారు. తుది జాబితా ప్రచురించిన తరువాత కూడా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే లోపు ఎప్పుడైనా సంబంధిత డిప్యూటీ కమిషనర్‌కు ఆన్‌లైన్, నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చుని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed