- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటర్ ఐడీ లేదా.. డోంట్ వర్రీ.. 9 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకే..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆదివారం జరిగే ఎమ్మెల్సీ పోలింగ్‌కు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా తొమ్మిది రకాల గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటువేసే అవకాశమున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్లు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో వారి గుర్తింపు నిర్ధారించడంకోసం ఓటరు గుర్తింపు కార్డు కానీ లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన మరే గుర్తింపుకార్డునైనా చూపాలి.
ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, పాన్‌కార్డు, ఎంఎల్‌ఏ, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు, యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీ/డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్లు, దివ్యాంగులకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డులో ఏదైన ఒకటి తప్పనిసరిగా ఉండాలి. పోలింగ్‌రోజు ఆదివారం ఎలాంటి ప్రచారం నిర్వహించరాదని అధికారులు పేర్కొన్నారు.