భారం కావొద్దని భార్యకు ఉరివేశాడు.. చివరకు తాను కూడా..!

by Sumithra |
భారం కావొద్దని భార్యకు ఉరివేశాడు.. చివరకు తాను కూడా..!
X

దిశ, కామారెడ్డి: ఎవరికి భారం కావొద్దని వృద్ధ దంపతులు ప్రాణం తీసుకున్నారు. పక్షవాతంతో బాధపడుతున్న భార్యను కిటికీ‌ గ్రిల్‌కు ఊరేసిన భర్త.. అనంతరం తాను కూడా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈ విషాధ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..

చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన సిద్ధయ్య (65), బాలమణి(58) దంపతులు. ఈ దంపతులకు ఒక్కడే కొడుకు, తాను కూడా ఉద్యోగం నిమిత్తం ఫారిన్‌లో ఉంటున్నాడు. గత కొంత కాలం క్రితం కొడుకు వివాహం ఘనంగా జరిపించారు తల్లిదండ్రులు. కోడలు మాత్రం అత్తామామలతోనే చిన్నమల్లారెడ్డిలో ఉండగా.. భర్త విదేశంలోనే ఉంటున్నాడు. ఇదే సమయంలో బాలమణికి పక్షవాతం వచ్చింది. దీంతో ఆమె భాగోగులు కోడలు, మామ కలిసే చూసేవారు.

కానీ, కొద్ది రోజుల క్రితం సిద్ధయ్య బజార్‌కు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో గాయాలు కావడంతో ఇంటికే పరిమితం అయ్యాడు. దీంతో ఇద్దరూ తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు. ముఖ్యంగా కొడుకు, కొడలుకు తాము భారం కావొద్దని భావించిన సిద్ధయ్య.. మంగళవారం భార్య బాలమణికి ఇంట్లో ఉన్న కిటికీ గ్రిల్‌కు ఉరి వేసి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకున్నాడు. వృద్ధ దంపతుల ఆత్మహత్యతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story