- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ ఫస్ట్ ‘బిట్‌కాయిన్ సిటీ’.. లీగల్ టెండర్ కల్పించిన మొదటి దేశం
దిశ, ఫీచర్స్ : పదేళ్ల క్రితం పైసల్లో మొదలైన ‘క్రిప్టోకరెన్సీ’ చరిత్ర.. ఇప్పుడు లక్షల విలువతో సంచలనంగా మారింది. డిజిటల్ కరెన్సీలో భాగమైన ‘క్రిప్టో’పై పెట్టుబడుల సంఖ్య దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. అంతర్జాతీయ వర్చువల్ కరెన్సీగా చెలామణిలో ఉన్న ఈ కాయిన్స్‌ను ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడైనా ఆపరేట్ చేయొచ్చు. ఇది ఏ దేశానికీ సొంతం కాదు, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. ఏ బ్యాంకుతోనూ సంబంధం లేకపోగా, ఒరిజినల్ కరెన్సీకి ఎక్స్‌చేంజ్‌గా వాడే అవకాశముంది. క్రిప్టోకరెన్సీని లీగలైజ్ చేసిన దేశాల్లో మాత్రం ఈ కరెన్సీని ఉపయోగించి వస్తుసేవలను పొందవచ్చు.
అయితే బిట్ కాయిన్ లావాదేవీలను పలుదేశాలు నిషేధించగా, ఈ కరెన్సీని లీగల్ టెండర్‌గా గుర్తించిన ఏకైక దేశం మాత్రం ‘ఎల్ సాల్వడార్’. ప్రస్తుతం క్రిప్టోలో ‘ఈథేరియం, డ్యాష్, రిపిల్, డాగీ’ వంటి పలు కరెన్సీలు అందుబాటులో ఉన్నా బిట్‌కాయిన్‌కే క్రేజ్ ఎక్కువ. దీంతో బిట్ కాయిన్‌కు చట్టబద్ధత కల్పించే దిశగా కొన్ని దేశాలు అడుగులు వేస్తుండగా.. ఎల్ సాల్వడార్ ఏకంగా బిట్‌కాయిన్ నగరాన్నే నిర్మిస్తోంది. ఇంతకీ ‘బిట్‌కాయిన్ సిటీ’ అంటే ఏమిటి? దీనివల్ల ప్రజలకు, ప్రభుత్వాలకు ఎలాంటి ప్రయోజనాలుంటాయి?
సెంట్రల్ అమెరికాకు చెందిన ‘ఎల్ సాల్వడార్’ కంట్రీ.. బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించిన మొదటి దేశం అని తెలిసిందే. ఈ దేశం ప్రస్తుతం ప్రపంచంలోనే మొట్టమొదటి ‘బిట్‌కాయిన్ సిటీ’ని నిర్మించనుండగా.. ఇందుకోసం ప్రభుత్వం బిట్ కాయిన్ బాండ్ల ద్వారా నిధులు సేకరించనుంది. బిట్‌కాయిన్ విలువ గణనీయంగా పెరుగుతున్నందున దేశ ఆర్థిక వృద్ధిని, విదేశీ పెట్టుబడులను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నగరం కాయిన్ వలె వృత్తాకారంలో నిర్మితమవుతుండగా, సిటీ సెంటర్‌లో భారీ బిట్‌కాయిన్ చిహ్నాన్ని పోలిఉన్న ప్లాజా ఉంటుందని సమాచారం.
కాంచాగ్వా అగ్నిపర్వత సమీపంలో ఈ నగరం నిర్మించనుండగా.. బిట్‌కాయిన్ నగర నివాసితులు ఎలాంటి ఆస్తి, ఆదాయ, మూలధన లాభాలు లేదా పేరోల్ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అక్కడ వసూలు చేసే ఏకైక పన్ను ‘వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్’ మాత్రమే. ఈ సిటీలో నివాస ప్రాంతాలతో పాటు మాల్స్, రెస్టారెంట్స్, ఓడరేవు ఉంటాయి. కాగా ఎల్ సాల్వడార్ ఇప్పటికే ‘టెకాపా అగ్నిపర్వతం’ పక్కనే ఉన్న జియోథర్మల్ పవర్ ప్లాంట్‌లో బిట్‌కాయిన్ మైనింగ్ వెంచర్‌ను నడుపుతోంది.
బిట్‌కాయిన్ బాండ్స్?
ఎల్ సాల్వడార్ ప్రభుత్వం బిలియన్ డాలర్ల ‘యూఎస్ బిట్‌కాయిన్ బాండ్’ను ఆవిష్కరించింది. వీటిలో సగం ($500 మిలియన్లు) పవర్, మైనింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఉపయోగిస్తారు. మిగిలిన ($500 మిలియన్లు) విలువను మరిన్ని బిట్‌కాయిన్స్ కొనుగోలు చేసేందుకు వినియోగించనున్నారు. ఈ బాండ్ల జారీని బిట్‌కాయిన్ సేవలపై దృష్టి సారించే సంస్థ బ్లాక్ స్ట్రీమ్(Block Stream) ద్వారా నిర్వహించనున్నారు. టోకనైజ్ చేసిన బాండ్ ప్రపంచంలోని వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇది $100 డాలర్ల కంటే తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి యాక్సెస్ కలిగి ఉంటుంది.
లిక్విడ్ నెట్‌వర్క్ టూల్స్ ఉపయోగించి బాండ్ హోల్డర్స్‌కు డివిడెండ్స్ సులభంగా చెల్లించబడతాయి. ‘బాండ్’ అంటే కేవలం కంపెనీ/ప్రభుత్వం తీసుకున్న రుణం. బ్యాంకుకు వెళ్లడానికి బదులుగా, కంపెనీ తన బాండ్లను కొనుగోలు చేసిన పెట్టుబడిదారుల నుంచి డబ్బును పొందుతుంది. మూలధనానికి బదులుగా, కంపెనీ వడ్డీ కూపన్‌ను చెల్లిస్తుంది. రుణగ్రహీత తన కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి డబ్బును ఉపయోగిస్తే, పెట్టుబడిదారు పెట్టుబడిపై వడ్డీని పొందుతాడు.
ప్రజలకు ఉపయోగముందా?
ఐదు సంవత్సరాల బాండ్ల లాక్-అప్ తర్వాత ఎల్ సాల్వడార్.. క్రిప్టో హోల్డింగ్స్‌ను విక్రయించి, బాండ్ హోల్డర్స్‌కు అదనపు డివిడెండ్ చెల్లిస్తుంది. ఐదేళ్ల కాలంలో బిట్‌కాయిన్ విలువ $1 మిలియన్(సుమారు రూ. 7.4 కోట్లు)కు చేరుకుంటే, ఎల్ సాల్వడార్ రెండు త్రైమాసికాల్లో బిట్‌కాయిన్స్ విక్రయించి ఆ $500 మిలియన్లను తిరిగి పొందుతుంది. అయితే బిట్‌కాయిన్‌ను చట్టబద్ధమైన టెండర్‌గా గుర్తించడంతో విదేశాల్లో నివసిస్తున్న సాల్వడోరన్స్ స్వదేశానికి పంపే డబ్బుపై మిలియన్ డాలర్ల కమీషన్స్‌ను ఆదా చేయనుంది. సాల్వడోరన్లు గతేడాది విదేశాల నుంచి దాదాపు $6 బిలియన్లు స్వదేశానికి పంపగా, ఈ మొత్తం దేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 23%కి సమానం.
కార్బన్ ఫుట్‌పింట్..
సైబర్‌స్పేస్ నుంచి డిజిటల్ కరెన్సీని సంగ్రహించడానికి పెద్ద మొత్తంలో శక్తి అవసరం కాగా, బిట్‌కాయిన్ పరిశ్రమలో గ్లోబల్ CO2 ఉద్గారాలు 60 మిలియన్ టన్నులకు పెరిగాయి. ఇది సుమారు 9 మిలియన్ కార్ల నుంచి వచ్చే ఎగ్జాస్ట్‌కు సమానం. అందువల్లే దేశంలోని అగ్నిపర్వతాల నుంచి పునరుత్పాదక శక్తిని ఉపయోగించి బిట్‌కాయిన్ మైనింగ్ సౌకర్యాలను అందించే ప్రణాళికను అభివృద్ధి చేసేందుకు బకెల్ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని జియో థర్మల్ ఎలక్ట్రిక్ సంస్థ LaGeo ఇందుకోసం పని చేయనుంది.
విదేశీ మారకం..
Bukele గవర్నమెంట్ బిట్‌కాయిన్‌ను డాలర్లుగా మార్చేందుకు $150 మిలియన్ల నిధిని ఏర్పాటు చేసింది. అయితే డిజిటల్ కరెన్సీలో పదునైన హెచ్చుతగ్గులతో సంబంధం గల రిస్క్‌లను దేశం ఎలా నివారిస్తుందనే దానిపై సందేహాలు కొనసాగుతున్నాయి. దీని విలువ రోజుకు వందల డాలర్లు మారవచ్చు. ఎల్ సాల్వడర్ ప్రెసిడెంట్ బుకెల్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ క్రిప్టోకరెన్సీ అస్థిరత, ‘క్రిప్టో సిటీ’ కాన్సెప్ట్ ఎలా పని చేస్తుందనే దాని గురించి ఆందోళన చెందుతున్న చాలా మంది సాల్వ డోరన్స్.. ఈ చర్యను సంశయవాదంతోనే స్వాగతించడం గమనార్హం.
బిట్‌కాయిన్‌ను ఉపయోగించడం ద్వారా ఒక మిలియన్ కంటే తక్కువ ఆదాయ కుటుంబాలు అందుకునే మొత్తం ప్రతీ ఏటా బిలియన్ డాలర్లకు సమానంగా పెరుగుతుంది. ఇది మిలియన్ల మంది ప్రజల జీవితాలను, భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. అంతేకాదు మరింత సమర్థవంతమైన చెల్లింపుల వ్యవస్థను సృష్టించగలదు. అమెరికన్లకు ఆర్థిక సేవలను విస్తరించగలదు.