- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లింగ వివక్షపై ప్రశ్నిస్తున్న ‘ఏక్ దువా’
దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ ఈషా డియోల్ నిర్మాతగా మారింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఒరిజినల్స్ ‘ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈషా.. ప్రొడ్యూసర్‌గా జెండర్ డిస్క్రిమినేషన్‌ను టచ్ చేసిన ‘ఏక్ దువా’ సినిమాను తీసుకొస్తుంది. లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్‌లో ‘అబిడ’ క్యారెక్టర్‌లో నటించిన ఈషా.. ఆడపిల్లలకు ప్రాధాన్యతనివ్వని కుటుంబంలో తన కొడుకుతో పాటు కూతురికి సమాన హక్కులు, ప్రేమ కల్పించేందుకు పోరాటం చేసే మహిళగా కనిపించింది.
అబ్బాయిని దేవుడి ఆశీర్వాదంగా భావించే అబిడ(ఈషా డియోల్) అత్త, భర్త కొడుకును గారాబంగా చూసుకుంటూ.. తన కూతురిని మాత్రం దూరంగా పెట్టేస్తారు. కొడుకును దగ్గరుండి కారులో తీసుకెళ్లే భర్త.. కూతురిని మాత్రం పట్టించుకోడు. ఆర్థికంగా ఇబ్బందులున్నా.. కొడుకు ఆడుకునేందుకు వేలల్లో ఖర్చుపెట్టి బొమ్మలు కొనిస్తారు.. కానీ అమ్మాయిని మాత్రం పట్టించుకోరు. అలాంటి వారిలో ఆడమగ సమానమేనన్న భావనను తీసుకొచ్చేందుకు చేసే ప్రయత్నమే ‘ఏక్ దువా’ కాగా.. ఈషా స్టోరీ సెలెక్షన్‌పై కాంప్లిమెంట్స్ అందుతున్నాయి. కాగా, రామ్ కమల్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న సినిమా జూలై 24న వూట్‌లో రిలీజ్ కానుంది.
Our film "Ek Duaa" premieres on Monday 26th July 2021 on @VootSelect . Do watch it and give us your love, good wishes, Duas & blessings. ♥️🧿
Checkout the trailer here: https://t.co/fvrmk1ge2s pic.twitter.com/XBMxPxLHwF
— Esha Deol (@Esha_Deol) July 19, 2021