అద్భుత దృశ్యం.. నిజాంసాగర్ గేట్లు ఎత్తివేత

by Shyam |
అద్భుత దృశ్యం.. నిజాంసాగర్ గేట్లు ఎత్తివేత
X

దిశ, నిజాంసాగర్: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ప్రాజెక్టు అధికారులు బుధవారం సాయంత్రం 8 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. 8 గేట్ల నుంచి 54 వేల 416 క్యూసెక్కుల వరద నీరు మంజీరా నదిలోకి విడుదల చేసినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కాగా, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 1404.58 అడుగులు ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 40 వేల 400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. ఎట్టకేలకు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed