దేవాలయాల అభివృద్ధికి కృషి..!

by Shyam |
దేవాలయాల అభివృద్ధికి కృషి..!
X

దిశ, పటాన్‌చెరు: బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆలయ ఆవరణలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన వసతి షెడ్, బాత్‎రూమ్‎లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎనిమిదవ వార్డులో నూతన విద్యుత్ స్తంభాలను, ట్రాన్స్‎ఫార్మర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరెడ్డి, కౌన్సిలర్లు నవనీత జగదీష్, బిజిలీ రాజు, గోపాల్, ప్రమోద్ రెడ్డి, ఆలయ కమిటీ డైరెక్టర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన అమీన్‎పూర్ మున్సిపాలిటీలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం వసతి షెడ్లు నిర్మించడం అభినందనీయమని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకతీతంగా అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Advertisement

Next Story