ప్రజలు క్షేమంగా ఉండాలి: ఈటల

by Shyam |
ప్రజలు క్షేమంగా ఉండాలి: ఈటల
X

దిశ కరీంనగర్: తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో క్షేమంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరుకున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కరీంనగర్‌లోని జమ్మికుంటలో ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాశివలింగ దివ్య దర్శనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించి కోరుకున్నానని తెలిపారు.

Advertisement

Next Story