బీఎస్ఎన్ఎల్ ఛార్జింగ్ స్టేషన్!

by Harish |
బీఎస్ఎన్ఎల్ ఛార్జింగ్ స్టేషన్!
X

బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(EECL)తో విద్యుత్ వాహానాలకు ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఒప్పందం జరిగింది. దేశవ్యాప్తంగా దశల వారీగా వెయ్యి బీఎస్ఎన్ఎల్ కేంద్రాల్లో అవసరమైన ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఛార్జింగ్ స్టేషన్లకు కావాల్సిన స్థలం, విద్యుత్తు బీఎస్ఎన్ఎల్ సంస్థనే సమకూరుస్తుంది. ఇక ఛార్జింగ్ చేయడానికి అవసరమైన సర్వీసులకు మౌలిక సదుపాయాలు, నిర్వహణ ఏర్పాట్లు ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ సంస్థ అందిస్తుంది. జాతీయ వాహన పథకంలో భాగంగా EECL సంస్థ ఇప్పటికే దేశం మొత్తమీద 300 వరకూ ఆల్టర్నేట్ కరెంట్ ఛార్జర్, 170 వరకూ డైరెక్ట్ కరెంట్ ఛార్జర్లను ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story

Most Viewed