యూజీసీ నెట్ రీ-ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల... సీబీటీ పద్ధతిలో పరీక్షలు

by Geesa Chandu |
యూజీసీ నెట్ రీ-ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల... సీబీటీ పద్ధతిలో పరీక్షలు
X

దిశ, వెబ్ డెస్క్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(UGC NET 2024) జూన్ 2024 పరీక్షలకు సంబందించి కొత్త షెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం యూజీసీ నెట్ పరీక్షలు ఆగస్టు 21 నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు జరగనున్నాయి. పేపర్ లీకుల నేపథ్యంలో ఈ సారి పేపర్ లీకులను ఆన్ లైన్ లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. ఈ పరీక్షలకు సంబందించిన అడ్మిట్ కార్డులు, ఎగ్జామ్ సెంటర్ తదితర వివరాలను అతిత్వరలో అఫీషియల్ వెబ్ సైట్ లో పొందుపర్చనున్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30 మరియు సెప్టెంబర్ 2, 3, 4 వ తేదీలలో రోజుకు రెండు సెషన్ ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నట్లు యూజీసి వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టులకు సంబందించిన పరీక్షల నిర్వహణ బాధ్యతను NTA కు యూజీసీ అప్పగించింది.

జూనియర్‌ రీసెర్చిఫెలోషిప్‌ మరియు యూనివర్సిటీలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రతీ ఏట రెండు సార్లు యూజీసీ నెట్‌ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలివిడతలో విడుదల చేసిన నెట్‌ నోటిఫికేషన్‌కు ఏప్రిల్‌ 20 నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 9,08,580 మంది విద్యాలు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 18వ తేదీన పేపర్‌ విధానంలో పరీక్షలను కూడా నిర్వహించారు.అయితే పరీక్ష జరిగిన 24 గంటల్లోపే పేపర్ లీక్‌ ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ ఈ పరీక్షను రద్దు చేసింది. డార్క్‌ నెట్‌ అనే వెబ్ పోర్టల్ లో యూజీసీ నెట్‌కు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు ప్రత్యక్షమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో నెట్‌ పరీక్షను రద్దు చేసిన యూజీసీ, మరోమారు పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. అయితే ఈసారి ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.

పరీక్షలకు సంబందించిన తేదీల విడుదలతో పాటు, సందేహాల నివృత్తి కొరకు NTA హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా విడుదల చేసింది. NTA NET 2024 జూన్ పరీక్షకు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే 011-40759000 లేదా [email protected] మెయిల్ ని సంప్రదించవచ్చని పేర్కొంది.

Advertisement

Next Story