UGC NET డిసెంబర్-2023 అప్లికేషన్ చివరి తేదీ ఇదే

by Harish |   ( Updated:2023-10-27 13:41:57.0  )
UGC NET డిసెంబర్-2023 అప్లికేషన్ చివరి తేదీ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 కి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. ఈ పరీక్ష ద్వారా జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, వివిధ యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. మొత్తం 83 సబ్జెక్ట్‌లకు సంబంధించి డిసెంబర్‌లో పరీక్షను నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పరీక్ష విధానం ఆన్‌లైన్ ద్వారా జరుగుతుంది.

అర్హత: 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ

వయస్సు: JRF పోస్టులకు 1-12-2023 నాటికి 30 ఏళ్లు దాటకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ట వయస్సు లేదు.

పరీక్ష విధానం: CBT విధానంలో ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.1150.

EWS, OBC -NCL అభ్యర్థులకు రూ.600.

SC/ST/PwD, థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.325.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 30-9-2023

చివరి తేదీ: 31-10-2023.

పరీక్ష తేదీలు: 6-12-2023 నుంచి 22-12-2023 వరకు.

వెబ్‌సైట్: https://ugcnet.nta.nic.in/

నోటిఫికేషన్: https://cdnbbsr.s3waas.gov.in/s301eee509ee2f68dc6014898c309e86bf/uploads/2023/09/2023093035.pdf

Advertisement

Next Story

Most Viewed