ఇకపై మాతృభాషలో పరీక్షలు.. యూజీసీ కీలక ఆదేశాలు

by Javid Pasha |   ( Updated:2023-04-19 13:01:50.0  )
ఇకపై మాతృభాషలో పరీక్షలు.. యూజీసీ కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : డిగ్రీ చదివే విద్యార్థులకు యూజీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యా సంస్థల్లో స్థానిక భాష(మాతృభాష)లకు ప్రాధాన్యత కల్పించేలా కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో కోర్సులను చదువుతున్నప్పటికీ వారు స్థానిక భాషలో పరీక్షలు రాసేందుకు అనుమతించాలని యూనివర్సిటీలను సూచించింది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలకు చైర్మన్ జగదీశ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టెక్ట్స్ బుక్స్‌ను రూపొందించడంతో పాటు, టీచింగ్, లెర్నింగ్ స్థానిక భాషలో జరిగేందుకు ఉన్నత విద్యాసంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇంకా స్థానిక భాషల్లో పుస్తకాల అనువాదాన్ని ప్రోత్సహించాలని, స్థానిక భాషల్లోనే బోధన-అభ్యాసన ప్రక్రియ ఉపయోగించాలని కోరింది.

Advertisement

Next Story