PM Internship Scheme:పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్.. రిజిస్ట్రేషన్‌కు నేడే లాస్ట్ డేట్

by Jakkula Mamatha |
PM Internship Scheme:పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్.. రిజిస్ట్రేషన్‌కు నేడే లాస్ట్ డేట్
X

దిశ,వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి, నైపుణ్య అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024’ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. నవంబర్ 10 చివరి తేదీగా ఉంది. నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ఈ పథకం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MCA) ప్రారంభించింది.

హైస్కూల్ లేదా హయ్యర్ సెకండరీ స్కూల్‌ విద్యలో ఉత్తీర్ణత, ఐటీఐ నుంచి సర్టిఫికెట్, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా సర్టిఫికెట్లు కలిగిన వారు అర్హులుగా ఉన్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీబీఏ, బీఫార్మా వంటి డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అర్హులుగా ఉన్నారు. ఇక దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్/డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌లో చదివిన వారు కూడా అర్హులుగా ఉన్నారు.ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024కు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను pminternship.mca.gov.in సందర్శించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed