- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారతదేశ చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు
* 1939 లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ పేరు ఏమిటి?
ans. ఫార్వర్డ్ బ్లాక్
* మూడో పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
ans. 1761
* ఆర్య సమాజాన్ని హైదరాబాద్‌లో ఏ ఏడాదిలో స్థాపించారు?
ans. 1899
* 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిన రోజు?
ans. ఆదివారం.
* కాకతీయ రాజ్యాన్ని ఎక్కువ కాలం పాలించింది ఎవరు?
ans. గణపతి దేవుడు
* భారతదేశ మొదటి వైస్రాయ్ ఎవరు?
ans. లార్డ్ కానింగ్
* 1760 వందవాసి యుద్ధంలో బ్రిటీష్ సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు?
ans. సర్ ఐర్‌క్యూట్
* మహమ్మద్ గజినీ సోమనాథ్ దేవాలయంపై ఏ సంవత్సరంలో దాడి చేశాడు?
ans. క్రీ. శ. 1026
* శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందిన వారు?
ans. తుళువ
* జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ans. అల్లావుద్దీన్ ఖిల్జీ
* సిక్కు మత స్థాపకుడు ఎవరు?
ans. గురునానక్
* మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం?
ans. క్రీ.శ. 1526
* ఢిల్లీ సుల్తాన్ రాజ్య స్థాపకుడు ఎవరు?
ans. కుతుబుద్దీన్ ఐబక్
* చౌగాన్ ఆడుతూ మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ans. కుతుబుద్దీన్ ఐబక్
* మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎకైక ముస్లిం పాలకురాలు?
ans. రజియా సుల్తానా
* బ్రాహ్మణుల నుంచి జిజియా పన్ను వసూలు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
ans. ఫిరోజ్ షా తుగ్లక్
* నానాసాహెబ్ అసలు పేరు ఏమిటి?
ans. దోండుపంత్
* 1857 తిరుగుబాటు ఎక్కడ మొదలైంది?
ans. మీరట్
* మొఘల్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం?
ans. మొదటి పానిపట్టు యుద్ధం
* ఉద్యానవన రాజు బిరుదు కలిగిన వారు ఎవరు?
ans. బాబర్