టెన్త్ పుస్తకాల్లో ‘పిరియాడిక్‌ టేబుల్‌’ తొలగింపు

by GSrikanth |
టెన్త్ పుస్తకాల్లో ‘పిరియాడిక్‌ టేబుల్‌’ తొలగింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా విద్యార్థులపై కంటెంట్ లోడ్‌ను తగ్గించేందుకు ఎన్‌సీఆర్టీ (జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పదవ తరగతి పాఠ్య పుస్తకం నుంచి మరిన్ని పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు పిరియాడిక్‌ టేబుల్‌, ప్రజాస్వామ్యం, శక్తి వనరులు, ప్రజాస్వామ్యానికి సవాళ్లు, రాజకీయ పార్టీల పూర్తి అధ్యాయాలు వంటి పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులపై భారాన్ని తగ్గించడం అత్యవసరమని ఎన్‌సీఆర్టీ పేర్కొంది. కాగా, ఇటీవలే జీవపరిణామ సిద్ధాంతాన్ని పదోతరగతి సిలబస్‌ నుంచి ఎన్‌సీఆర్టీ తొలగించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed