- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NFL Jobs: నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్(National Fertilizers Ltd) వివిధ కార్యాలయాల్లో నాన్-ఎగ్జిక్యూటివ్(Non-Executive) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 336 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.nationalfertilizers.com ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 8 నవంబర్ 2024.
పోస్టుల వివరాలు:
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (ప్రొడక్షన్)-108, జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2(ఇన్‌స్ట్రుమెంటేషన్)-33, జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (ఎలక్ట్రికల్)-14 జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-2 (కెమికల్)-10, స్టోర్ అసిస్టెంట్-19, నర్స్-10, ఫార్మసిస్ట్-10, అకౌంట్స్ అసిస్టెంట్-10, అటెండెంట్ గ్రేడ్ I (మెకానికల్)- ఫిట్టర్-40
విద్యార్హత:
పోస్టును బట్టి డిప్లొమా, బీఎస్సీ, బీకామ్, నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 9 సెప్టెంబర్ 2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 200 ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.