AP Tet 2024: టెట్ సిలబస్ మార్పుపై మంత్రి నారా లోకేష్ స్పష్టత..

by Indraja |   ( Updated:2024-07-03 15:54:34.0  )
AP Tet 2024: టెట్ సిలబస్ మార్పుపై మంత్రి నారా లోకేష్ స్పష్టత..
X

దిశ వెబ్ డెస్క్: గత ఐదేళ్లుగా ఉపాధి, ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్న యువతకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త ఆశలు చిగురించాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సైతం మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాల ప్రకారమే నడుచుకుంటోందని ప్రజలు కొనియాడుతున్నారు. ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేయడం అందరికీ తెలిసిన విషయమే.

కాగా త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ సైతం విడుదల కానున్నట్టు సమాచారం. ఈ నేసథ్యంలో డీఎస్సీ సిలబస్ అంశంలో పలు అనుమానాలు ఉన్నట్టు అభ్యర్థలు పేర్కొ్ంటున్నారు. కాగా మంత్రి నారా లోకేష్ ఆ అనుమానలపై ట్విట్టర్ వేదికగా స్పంధించారు. టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై పాఠశాల విద్య ఉన్నతాధికారులతో తాను సమీక్షించినట్టు తెలిపారు. టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి వ‌స్తున్న విజ్ఞప్తులని ప‌రిశీలించాల‌ని సూచించినట్టు పేర్కొన్నారు.

అలానే టెట్ సిలబస్ మార్పు జరిగిందని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సిలబస్‌లో ఎటువంటి మార్పులు చేయ‌లేదని స్పష్టం చేశారు. సిల‌బ‌స్‌ వివరాలను https://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని.. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాల‌కు ఎదురైన న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు వెల్లడించారు.

అలానే గత ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డిఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాల‌ని నిర్ణయించినట్టు అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. ఇక విద్యాప్రమాణాలు మెరుగుపర్చడమే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని అధికారుల‌కు సూచించాం అని అన్నారు.

Read more...

Breaking:నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా

Advertisement

Next Story

Most Viewed