- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Good News: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 1.8 లక్షల జీతం

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 18వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు:
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(కెమికల్) 21
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఇన్ స్ట్రెమెంటేషన్) 17
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 14
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(మెకానికల్) 8
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(బీఐఎస్) 13
విద్యార్హతలు: 65 శాతం మార్కులతో కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ, పాలిమర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్, మాన్యుఫ్యాక్చరింగ్, మెకానికల్ ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ తదితర సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 18 మార్చి 2025 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ వారికి 10 ఏళ్ల సడలింపు ఉంటుంది).
వేతనం: నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000.
ఎంపిక ప్రక్రియ: గేట్- 2025 స్కోర్
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 18 మార్చి 2025.