JEE MAIN-2024: తొలి విడత పరీక్షలు ఈ తేదీ నుంచే

by Harish |   ( Updated:2023-11-02 13:29:25.0  )
JEE MAIN-2024: తొలి విడత పరీక్షలు ఈ తేదీ నుంచే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా NIT,IIITలో బీటెక్ సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE) మెయిన్-2024 తొలి విడత పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే చివరి విడత పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు జరుపుతామని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను నవంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఏప్రిల్‌లో జరిగే చివరి విడత పరీక్షలకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022, 2023లో 12వ తరగతి లేదా దానికి సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు, 2024లో 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు JEE MAIN-2024 కు హాజరు కావచ్చు. మొదటి విడత హాల్‌టికెట్లను జనవరి మూడో వారంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

Advertisement

Next Story

Most Viewed