MBA,MCA సీట్ల కోసం 15న ఐసెట్ కౌన్సిలింగ్

by Harish |
MBA,MCA సీట్ల కోసం 15న ఐసెట్ కౌన్సిలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం ఇటీవల కొత్తగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో MBA,MCA సీట్లను మంజూరు చేసింది. అయితే ఈ సీట్లను ప్రత్యేకంగా భర్తీ చేయనున్నారు. 15 వ తేదీ నుంచి ఐసెట్ ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కన్వీనర్ వాకాటి కరుణ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం MBAలో 3060 సీట్లు, MCA లో 2,700 సీట్లను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా అక్టోబర్ 15న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. 16న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 16,17న వెబ్‌ ఆప్షన్లను కూడా ఇవ్వాలి. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. 20న సీట్ల కేటాయింపు జరుగుతుంది.

Advertisement

Next Story